telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సీఎం ఇప్పటి కైనా ప్రగతి భవన్ దాటి బయటకి రావాలి

బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గా హుస్సేన్ నాయక్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, రవీంద్ర నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ..మతపరమైన రిజర్వేషన్లను అడ్డుకుంటామని..సీఎం కి చిత్తశుద్ధి లేదు అందుకే ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. ప్రతి గిరిజన తండాలో డబల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాలని..లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర సహాయమే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసేందేమి లేదని తెలిపారు. క్రైస్తవ మిషనరీ లు మోసం చేసి మత మార్పిడిలకు పాల్పడుతున్నాయి… కారణం సీఎం అని పేర్కొన్నారు. హిందువుగా పుట్టడం ఎంత గొప్పనో మరణించే వరకు హిందువుగా ఉండడం అంతే గొప్ప అని..హిందువులం వారానికో పండుగ, రోజుకో దేవుణ్ణి ప్రార్థిస్తామని పేర్కొన్నారు. దుబ్బాక లో గిరిజనులు బీజేపీ కి ఓటు వేశారని..సీఎం ఇప్పటి కైనా ప్రగతి భవన్ దాటి బయటకి రావాలని డిమాండ్ చేశారు. హైద్రాబాద్ మునుగిపోతున్న ప్రగతి భవన్ లో జల్సాలు చేశారని..గడిలా పాలన పోవాలి… పేదల పాలన రావాలని చెప్పారు.

Related posts