telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సినిమా వార్తలు

టీడీపీకి పూర్వవైభవం తెస్తా.. సినిమాలు పక్కన పెడుతున్నా.. : బాలయ్య

Bala krishna comments ys jagan

నందమూరి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలకు కాస్త విరామం ఇచ్చి టిడిపి పూర్వ వైభవానికి కృషి చేయాలని డిసైడ్ అయ్యారట. అదే విషయాన్ని బావ చంద్రబాబునాయుడుకు చెబితే ఆయన కూడా సంతోషించారట. మొన్నటి ఎన్నికల్లో టిడిపి ఘోర ఓటమిపాలైన విషయం అందరికీ తెలిసిందే. దాంతో పార్టీ నేతల్లో ఓ విధమైన నైరాస్యం పేరుకుపోయింది. నేతల్లోని నైరాస్యాన్ని పోగొట్టేందుకు బాలకృష్ణ ఎక్కువ సమయాన్ని పార్టీ కోసమే కేటాయించాలని డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల విషయాన్ని పక్కనపెట్టినా రామలసీమలో మాత్రం బాలయ్యకు మంచి క్రేజుంది. నిజానికి బాలయ్యకు సొంతంగా వచ్చిన క్రేజుకన్నా సీనియర్ ఎన్టీయార్ నుండి వారసత్వంగా వచ్చిన అభిమానుల సంఖ్యే చాలా ఎక్కువనటంలో సందేహం లేదు.

అనంతపురం జిల్లాలోని హిందుపురం నియోజకవర్గంలో బాలయ్యపై ఎంతటి వ్యతిరేకత ఉన్నా మొన్నటి ఎన్నికల్లో రెండోసారి గెలిచారంటే అందుకు సీనియర్ ఎన్టీయార్ పై ఉన్న అభిమానమే కారణం. కాబట్టి ఇదే అభిమానాన్ని నిలుపుకునేందుకు తొందరలోనే రాయలసీమ ప్రాంతంలో పర్యటనలు పెట్టుకోవాలని బాలయ్య నిర్ణయించారట. పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానంటే బాబు ఒప్పుకుంటారా.. ఒకవేళ బాలయ్య అన్నంత పని చేసి చూపిస్తే, సీఎం కాండిడేట్ తానే అవుతానని కూడా అంటాడనే కనీస జ్ఞానం బాబుకు ఉండకపోతుందా.. ఈ రాజకీయ పరిణామాలతో.. బాలయ్య నిర్ణయాన్ని చంద్రబాబు నీరుగార్చే అవకాశాలే ఎక్కువ అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related posts