telugu navyamedia
రాజకీయ

బీజేపీలో చేరిన బిపిన్ రావత్ సోదరుడు విజయ్‌ రావత్

ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల్లో చేరికలు, రాజీనామాల ప్రక్రియ ఊపందుకుంటుంది.

తాజాగా..దివంగత సీడీఎస్ బిపిన్ రావత్​ సోదరుడు విజయ్ రావత్​ బీజేపీలో చేరారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకొన్నారు. 

Late CDS General Bipin Rawat's brother Colonel (retd) Vijay Rawat joins BJP - Elections News

సైన్యంలో కల్నల్ గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన విజయ్ రావత్.. ప్రధాని మోదీ ఆలోచన విధానం నచ్చే బీజేపీలో చేరినట్టుగా వెల్లడించారు. దోయివాలా అసెంబ్లీ స్థానం నుంచి విజయ్ రావత్ పోటీ చేయవచ్చని వర్గాల సమాచారం.

ఈ సందర్భంగా విజయ్ రావత్ మాట్లాడుతూ బీజేపీలో చేరే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచన చాలా తెలివైనది మరియు భవిష్యత్ వాదమన్నారు.  పార్టీ ఆమోదిస్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

Uttarakhand Elections: Vijay Rawat, brother of late CDS Bipin Rawat, who joined BJP | Uttarakhand assembly election 2022: late cds bipin rawat brother colonel vijay rawat joined bjp | Reading Sexy

మా నాన్న (జనరల్ లక్ష్మణ్ సింగ్ రావత్) రిటైర్మెంట్ తర్వాత బీజేపీలో చేర‌డం ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత ప్రత్యేకమైనది. ఆయన కృషి అంతా ఈ దేశ ప్రగతి కోసమే. నన్ను బీజేపీలో చేరమని ప్రోత్సహించారు. అయితే దోయివాలా అసెంబ్లీ స్థానం నుంచి విజయ్‌ రావత్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

కాగా.. 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్ కు ఫిబ్రవరి 14న ఎన్నికల పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది.

Related posts