telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రభుత్వ ఆసుపత్రులలో రక్తం ఉచితంగా అందించనున్న మహరాష్ట్ర…

మరో అనూహ్య నిర్ణయం తీసుకుంది మహరాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో రక్తం ఉచితంగా ఇవ్వాలని నిశ్చయించింది. అయితే ఈ నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా రక్తాన్ని ఉచితింగా అందించాలని తెలిపింది. ఇది నేటి నుంచే మొదలు కానుంది. దీని సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే ముందుగా ప్రకటించారు. ఈ నేల 12నుంచి ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ రక్తం ఉచితంగా ఇవ్వబడుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ట్విటర్ వేదికగా రాష్ట్ర ప్రజలలు రక్తదానం ఇచ్చే విదంగా ఉత్సాహ పరిచారు. అయితే ఈ అనూహ్య నిర్ణయానికి కారణం.. మహరాష్ట్ర దేశంలోనే అత్యధికంగా కరోనా చేత బాధింపబడుతున్న రాష్ట్రంగా ఉందని, కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మండలి లెక్కల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 74,408 యాక్టివ్ కేసులు ఉన్నాయని వారు తెలిపారు. దాంతో రాష్ట్రంలో ఎలాగైనా కరోనా కేసులను నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాట్లు అధికారులు తెలిపారు. మరి దీనిని మిగిత రాష్ట్రాలు కూడా పాటిస్తాయా… లేదా అనేది చూడాలి.

Related posts