telugu navyamedia
క్రీడలు వార్తలు

IND vs AUS : ఆసీస్ విజయం…

southafrica struggles on australia

ఈరోజు సిడ్నీ భారత్-ఆసీస్ ల మధ్య తిరిగిన మొదటి మ్యాచ్ లో విజయం సాధించి ఆధిక్యంలోకి వెళ్ళింది ఆస్ట్రేలియా. 375 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మొదట తడబడింది. మొదటి వికెట్ కు 53 పరుగులు జోడించిన తర్వాత ఓపెనర్ మయాంక్ (22) వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(21), అయ్యర్(2), కేఎల్ రాహుల్ (12) వరుసగా పెవిలియన్ కు చేరుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పాండ్యా అప్పటికే గ్రౌండ్ లో కుదురుకున్న ధావన్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు తమ అర్ధస్తకాలు పూర్తి చేసుకొని 5వ వికెట్ కు 118 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత ధావన్ (74) వద్ద ఆడమ్ జాంపాకు వికెట్ సమర్పించుకోగా హార్దిక్ (90) కూడా జాంపా బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన టేలెండర్లలో ఎవరు రాణించకపోవడంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది.  అయితే అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో డేవిడ్ వార్నర్ (69), ఆరోన్ ఫించ్ (114), స్మిత్ (105) పరుగులతో రెచ్చిపోవడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల ఈ వన్డే సిరీస్ లో ఆసీస్ 0-1 తో ఆధిక్యంలోకి వెళ్ళింది. ఇక రెండో మ్యాచ్ ఈ నెల 29న జరగనుంది.

Related posts