telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

చందమామపై అడుగుపెట్టి నేటికి 50 ఏళ్ళు పూర్తి… గూగుల్ డూడుల్ సెలబ్రేషన్స్

Moon-Landing

జులై 16, 1969న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచీ శాట్రన్ V రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. చందమామపై మానవుడు కాలుమోపి ఈరోజుతో 50 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన వీడియో యానిమేషన్‌ని గూగుల్ ఇవాళ తన డూడుల్‌లో ఉంచింది. అపోలో 11 మిషన్ కోసం 4లక్షల మంది శాస్త్రవేత్తలు, టెక్నీషియన్లు పనిచేశారు. చివరకు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకెల్ కొల్లిన్స్ మాత్రమే చందమామ చెంతకు వెళ్లేందుకు అనుమతి లభించింది. కమాండ్ మాడ్యూల్ పైలట్ అయిన మైకెల్ కొల్లిన్స్ మాడ్యూల్‌లోనే ఉండిపోగా, నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బుజ్ అల్డ్రిన్ మాత్రం చందమామపై దిగాలని నిర్ణయించారు. చందమామ చుట్టూ తిరిగిన తర్వాత “ది ఈగిల్” అని పిలిచే మాడ్యూల్ చందమామ ఉపరితలం వైపు 13 నిమిషాలు ప్రయాణించింది. ఈ జర్నీలో రెండు కీలక సమస్యలు ఎదురయ్యాయి. మొదటి సమస్య… నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, బుజ్ ఆల్డ్రిన్‌కి భూమితో రేడియో కాంటాక్ట్స్ తెగిపోయాయి. ఆన్ బోర్డ్ కంప్యూటర్‌లో ఎర్రర్ మెసేజ్ కనిపించింది. రెండో సమస్య… ఇంధనం సరిపోని పరిస్థితి. అదృష్టవశాత్తూ రెండింటినీ వ్యోమగాములు పరిష్కరించగలిగారు. ఈ రెండు సమస్యలూ ఉన్నప్పటికీ మాడ్యూల్‌ని విజయవంతంగా చందమామపై ఉన్న పగులు లోయ సీ ఆఫ్ ట్రాంక్విలిటీలో జులై 20న విజయవంతంగా దింపగలిగారు. చందమామపై తొలి అడుగు పెట్టిన వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్. తాను వేసిన ఆ చిన్న అడుగు భవిష్యత్ తరాల పరిశోధనకు ఊతమిచ్చింది.. ముగ్గురు వ్యోమగాములూ జులై 25, 1969న భూమికి తిరిగొచ్చి చరిత్ర సృష్టించారు.

Related posts