తెలంగాణ రాష్ట్రం మొత్తం దుబ్బాక ఉప ఎన్నికల వైపు చూస్తుంది. తాజాగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోసారి బీజేపీ, టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఫైటింగ్‌కు దిగారు. సిద్ధిపేటలో స్వర్ణప్యాలెస్ దగ్గర రెండు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆందోల్ ఎమ్మెల్యే మీద దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. బిజెపి కార్యకర్తలు తన మీద దాడికి ప్రయత్నించారు అని అని క్రాంతి కిరణ్ ఆరోపించారు. దాడి చేస్తుంటే కొంత మంది పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని అయినా సరే నేనే టార్గెట్ అన్నట్టు వాళ్ళు తన మీదకు దూసుకు వచ్చారని ఆయన అన్నారు. తన రూంలో డబ్బులు ఉన్నయాని ఆరోపిస్తూ వాటిని వెతికేందుకు అక్రమంగా చొచ్చుకురావడానికి ప్రయత్నించినా సరే తాను వచ్చి వెతుక్కోవచ్చు అని చెప్పానని అన్నారు. అలా చెప్పినా తన మీద దాడి చేయాలనే ఉద్దేశంతోనే వచ్చారని ఆయన ఆరోపించారు. ఎవరో ఒకరి మీద దాడి చేసి దాన్ని సెన్సేషన్ క్రియేట్ చేయాలని వచ్చారని ఆయన అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
previous post
గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం చేస్తాను : స్పీకర్ తమ్మినేని