telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ జంతువును హగ్ చేసుకుంటే బోల్డన్ని ప్రయోజనాలు…

ఎక్కడైనా కొత్త వైద్య విధానం వచ్చిందంటే చాలు.. జనం వెంటనే ఎట్రాక్ట్ అవుతారు. దానిని తప్పకుండా పాటిస్తారు. ఆయిల్ పుల్లింగ్ మొదలు.. ప్రకృతి వైద్యం వరకూ.. ఎవరు ఏం చెప్పినా ఆచరిస్తూ ఉంటారు. ఇదే కోవలో ఇప్పడు గో..కౌగిలి ట్రెండింగ్ లో ఉంది. నెదర్లాండ్స్‌లోని రీవర్‌లో ఎప్పటి నుంచో ఈ థెరపీ అందుబాటులో ఉంది. ఇప్పుడు దీనికి ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చేసింది. గోవుతో చాలా లాభాలు ఉన్నాయనేది మనదేశంలో ఎప్పటినుంచో తెలిసిన వ్యవహారమే. గోమూత్రం, గోమయం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటారు. అందుకనే గోవును గోమాతగా కొలుస్తారు.  పురాణేతిహాల్లో అయితే చెప్పక్కర్లేదు. 2007లో  అప్లైడ్ యానిమల్ బిహేవియర్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. గోవులను ఆలింగనం చేసుకోవడం వల్ల ఒత్తిడి పోయి మనసుకు హాయిగా ఉంటుందని, దాని వీపు, మెడ, చెవులు, గంగడోలు ప్రాంతాల్లో ప్రేమగా నిమరడం వల్ల ఒత్తిడి   ఎగిరిపోతుందని అధ్యయనం వివరించింది. చాలా దేశాల్లో ‘గో కౌగిలి’ కోసం వెల్‌నెస్ సెంటర్లు కూడా వెలస్తున్నాయి. గోవును కౌగిలించుకోవడం వల్ల మానవులలో పిట్యుటరీ గ్రంథి ప్రేరేపితమవుతుందని… ఫలితంగా ఒత్తిడి తగ్గుతుందని నమ్ముతారు. సామాజిక పరమైన బంధాలలో ఈ హార్మోన్ విడుదలవుతుంది. క్షీరదాలను ఆలింగనం చేసుకోవడం వల్ల ప్రశాంతమైన భావాలు కలుగుతాయని  అధ్యయనాల్లో తేలింది.

Related posts