telugu navyamedia
రాజకీయ

ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు: లీడింగ్‌లో బీజేపీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీఎన్నికల కౌంటిం గ్‌ప్రారంభమైంది.. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ ఫలితాలు సాయంత్రానికి వెలువడనున్నాయి.

ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. భారీ భద్రతా మధ్య, కొవిడ్​ మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు పాటిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 403 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 10 నుండి మార్చి 7 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగిన విష‌యం తెలిసిందే.

ఏడు దశల్లో ఉత్తరప్రదేశ్‌లో 55 మరియు 65 శాతం మధ్య ఓటింగ్ నమోదైంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు అన్ని వైపుల నుండి దూకుడు ప్రచారం జరిగింది. కాంగ్రెస్ ,బహుజన్ సమాజ్ పార్టీ కాకుండా అధికార బిజెపి (మరియు మిత్రపక్షాలు) మరియు సమాజ్‌వాదీ పార్టీ – రాష్ట్రీయ లోక్‌దళ్ కలయిక మధ్య పోరు ఎక్కువగా ఉంది.

ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక పార్టీ 202 సీట్లు గెలుచుకోవాలి. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.

యూపీ ఎన్నికల్లో భాజపా విజయం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. సమాజ్‌వాదీ పార్టీ మరోసారి ప్రతిపక్షానికే పరిమితమవుతుందని తెలిపాయి. అయితే 2017 ఎన్నికలతో పోలిస్తే తన బలాన్ని పెంచుకుంటుందని పేర్కొన్నాయి. భాజపానే మరోసారి అధికారంలోకి వస్తే గత 37 ఏళ్లలో యూపీలో వరుసగా రెండోసారి పాలనాపగ్గాలు చేపట్టిన పార్టీగా రికార్డు సృష్టించనుంది.

అయితే.. నాయకులు పార్టీలు మారడం నుండి కొత్త పొత్తుల కలయిక వరకు, EVM దొంగతనం ఆరోపణల నుండి ఆకర్షణీయమైన ఎన్నికల నినాదాల వరకు, 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని జ‌రిగాయి.

పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ, సీఎం చన్నీ మధ్య విభేదాలు తలెత్తడం వంటి పరిణామాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారనేది ఇప్పుడు ముఖ్యం. ఓట్ల లెక్కింపు త‌రువాత ఎవ‌రికి ప్ర‌జ‌లు ప‌గ్గం గ‌డ‌తార‌నేది తెలియాల్సి ఉంది.

Related posts