ప్రయాణీకులపై ఆంక్షలు వద్దని కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో త్వరలో అంతరాష్ట్ర బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన ఆర్టీసీని తిరిగి పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అధికారులు కీలక చర్చలు జరపాలని నిర్ణయించారు.
ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో పరిమిత సంఖ్యలో బస్సులు తిరుగుతున్నప్పటికీ, రెండు రాష్ట్రాల మధ్యా ఆర్టీసీ, ప్రైవేటు బస్ సర్వీసులు లేవన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కర్ణాటక నుంచి వస్తున్న బస్సులను ఏపీ అనుమతిస్తోంది. తమిళనాడు, తెలంగాణ నుంచి మాత్రం బస్సులను అనుమతించడం లేదు.
ఇక అత్యవసర పనులపై ప్రయాణాలు సాగించాల్సిన వారు, సొంత వాహనాల్లోనో, అద్దె వాహనాల్లోనో సరిహద్దుల వద్దకు వెళ్లి, నిబంధనల మేరకు స్క్రీనింగ్ తరువాత తమ గమ్యాలకు చేరుతున్నారు. ప్రైవేటు వాహనాల భారం చాలా అధికంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. ఇదే సమయంలో మార్చి నుంచి బస్సులను తిప్పకపోవడంతో ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీలకు తీవ్ర నష్టం ఏర్పడింది. కేంద్రం నుంచి గట్టి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో తిరిగి బస్సులను పునరుద్ధరిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఆర్టీసీ భావిస్తుట్టు తెలుస్తోంది.
కుట్రలు చేయొద్దని కేసీఆర్కు నటుడు శివాజీ విజ్ఞప్తి