ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి ట్విటర్ వేధికగా విమర్శలు గుప్పించారు. మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నిస్తోన్న వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇటువంటి ఆలోచనను సీఎం జగన్ విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆయన ట్వీట్లు చేశారు.
‘పాలకుడు మారిన ప్రతిసారి రాజధాని మార్చుకుంటూ పోతే జరిగేది అభివృద్ధి కాదు విచ్ఛిన్నం. వైఎస్ జగన్ మూడు ముక్కలాట ఒక వికృత క్రీడ. మూర్ఖపు ఆలోచనతో 85 మంది రైతుల్ని బలితీసుకున్నారు’ అని విమర్శలు గుప్పించారు.
‘రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతు న్యాయం చెయ్యమంటూ రణ భేరి మొదలుపెట్టి నేటికి 250 రోజులు అయ్యింది. ఇప్పటికైనా చేసిన తప్పు సరిదిద్దుకొని అమరావతిని రాజధానిగా కొనసాగించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ సోయం తీవ్ర వ్యాఖ్యలు!