telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మంత్రి పినిపే విశ్వరూప్‌కు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

*ఏపీ మంత్రి విశ్వరూప్ అస్వస్థత .
*హుటాహుటిని ఆస్ప‌త్రికి త‌ర‌లించిన కార్య‌క‌ర్త‌లు
*వైద్య ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి విశ్వరూప్‌ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని హుటాహుటిన  ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అమలాపురంలో వైఎస్‌ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని అస్వస్థతకు గురయ్యారు.

తొలుత ఆయనను అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా.. తన ఎడమ చేయి, ఎడమ  వైపు ముఖం లాగుతున్నట్టుగా నాయకులకు చెప్పడంతో ఆయనను  అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు  

అనంతరం, విశ్వరూప్‌ను హెల్త్‌ కండీషన్‌ను పరిశీలించిన వైద్యులు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఆయనను ఎన్ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు.

Related posts