telugu navyamedia
సినిమా వార్తలు

‘తమ్ముడు’కి అన్న చిరంజీవి ఎమోషనల్ పోస్ట్..

జనసేన పార్టీ అధినేత, ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నేడు. జనసేనాని తన 51వ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నుంచి మాత్రమే కాదు.. సినీ పరిశ్రమ, రాజకీయ నాయకుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.అలాగే ఆయన సోదరుడు, మెగాస్టార్‌ చిరంజీవి స్పెషల్‌ విషెస్‌ తెలిపారు.

తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’ అంటూ రెడ్‌ హార్ట్‌ ఎమోజీని జత చేసి తమ్ముడిపై తనకున్న ప్రేమని మరోసారి చాటుకున్నారు.

Related posts