బీజేపీ మరోసారి ఏపీ లో కీలకంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు అంతూపొంతూ లేని రైల్వే జోన్ అతిత్వరలో ప్రధాని ప్రకటించనున్నారని తాజాగా ఆ పార్టీ నేతలు వెల్లడించడం చర్చనీయాంశం అయ్యింది. విశాఖ రైల్వేజోన్ ఇచ్చేది, తెచ్చేది తామేనని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖపట్టణంలోని తాటిచెట్లపాలెం వద్ద ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం సందర్భంగా విష్ణుకుమార్ రాజు, ఎంపీ కంభంపాటి హరిబాబు అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, రైల్వేజోన్ అంశంపై తాము కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిశామని చెప్పారు. ఈ విషయమై ఆయన సానుకలంగా స్పందించారని, ఏపీలో ప్రధాని సభ రోజున లేదా అంతకుముందే రైల్వేజోన్ పై ప్రకటిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.
ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని లేదంటే రైల్వేజోన్ ను తానే తీసుకొచ్చానని చంద్రబాబు శంకుస్థాపన చేసినా చేస్తారని ఎద్దేవా చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ లు తానే తెచ్చానని, అబద్ధాలు చెప్పి చంద్రబాబు శంకుస్థాపన చేశారని ఆరోపించారు. కాగా, ఏపీ బీజేపీ నేతలు పీయూష్ గోయల్ ని ఏపీ బీజేపీ నేతలు నిన్న కలిశారు.
టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు: బాలినేని