ఏపీ పంచాయతీ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. విజయనగరం, ప్రకాశం జిల్లాలకు తొలి విడత ఎన్నికలు లేవని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ వెల్లడించారు. రెవెన్యూ డివిజన్ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయని మీడియా సమావేశంలో చెప్పారు. ఉ.6:30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగనుందని తెలిపారు. ఏపీలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగుతుందని.. అదేరోజు ఫలితాలు కూడా రానున్నాయని తెలిపారు. ఏపీలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని.. తొలి విడతకు జనవరి 25 నుంచి నామినేషన్లు తీసుకుంటామన్నారు. 27న నామినేషన్ల దాఖలుకు తుది గడువని స్పష్టం చేశారు. జనంరొ 31 న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో నిర్వహించడం తమ బాధ్యతగా పేర్కొన్నారు. సుప్రీం కోర్టు తీర్పు వస్తే పాటిస్తామని కూడా పేర్కొన్నారు నిమ్మగడ్డ.
previous post
next post