telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భర్తను దూరం చేసి తండ్రిని ఇచ్చాడు : నటి ఎమోషనల్ కామెంట్స్

neena-gupta

కోట్లు ఖర్చుపెట్టి ఘనంగా పెళ్లిళ్లు చేస్తే.. కొన్నేళ్లకే విడిపోతున్నారు. అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? సహజీవనం చేస్తే బెటర్ కదా అంటున్నారు. ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటి నీనా గుప్తా. ఆమె కూతురు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా. ఇటీవల మసాబా వ్యక్తిగత కారణాల వల్ల తన భర్త మధుతో విడిపోయారు. ఈ విషయం గురించి నీనా గుప్తా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నీనా కూతురు మసాబా తన భర్తతో విడిపోవడంతో ఆమె చాలా అప్‌సెట్ అయిపోయారు. వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చి భర్తతో విడిపోయిన మసాబా బాగానే ఉన్నారు. కానీ నీనా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు. అప్పుడు మసాబా తన తల్లికి ధైర్యం చెప్పారట. ఈ విషయాన్ని నీనా తెలిపారు. ‘నా కూతురి కాపురం కూలిపోయిందనందుకు నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. చాలా ఏడ్చాను. నేను నా కూతురికి ధైర్యం చెప్పాల్సిందిపోయి తనే నాకు ధైర్యాన్ని్చ్చింది. ఈ తరం పిల్లలు చాలా స్మార్ట్’ అని తెలిపారు.

నీనా గుప్తా ప్రముఖ వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వివ్ రిచర్డ్స్‌తో చాలా కాలం పాటు డేటింగ్ చేసారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని నీనా ఎప్పుడూ దాచలేదు. అయితే అప్పటికే రిచర్డ్స్‌కు పెళ్లైపోయింది. అయినా కూడా నీనా అతన్ని వదులుకోవాలని అనుకోలేదు. పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ అప్పటికే రిచర్డ్స్, నీనా తొందరపడ్డారు. ఫలితంగా నీనా గర్భం దాల్చింది. ఈ విషయం గురించి నీనా రిచర్డ్స్ భార్యతోనూ మాట్లాడేందుకు ప్రయత్నించింది. కానీ ఆమె విడాకులు ఇస్తానంటూ రిచర్డ్స్‌ను బెదిరించడంతో అతను తన భార్య వద్దకు వెళ్లిపోయారు. అయితే నీనాను బిడ్డను మాత్రం వీధిపాలు చేయలేదు. అప్పుడప్పుడూ వచ్చి కలిసి వెళ్లేవారు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో నీనా ఓ వీడియో వదిలారు. దయచేసి పెళ్లైన వ్యక్తితో మాత్రం అఫైర్ పెట్టుకోవద్దని, అలా చేసి తాను జీవితంలో చాలా కోల్పోయానని చెప్పుకొచ్చారు. నీనా ధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకున్నారు. ఆమెను తప్పుబట్టకుండా సపోర్ట్ చేసారు.

నీనాకు బిడ్డ పుట్టిన తర్వాత భర్త లేకపోవడంతో అప్పట్లో చాలా సమస్యలు ఎదుర్కొ్న్నారు. ఇండస్ట్రీలో వాళ్లు సూటిపోటి మాటలు అనేవారట. దాంతో చాలా మంది ఫ్రెండ్స్ నీనా వద్దకు వచ్చి ‘నిన్ను పెళ్లి చేసుకుంటా. నీ బిడ్డకు గుర్తింపు అయినా ఉంటుంది’ అనేవారట. దాంతో నీనాకు ఒళ్లుమండి.. ‘అవసరం లేదు. ఏం గుర్తింపు కావాలి నా బిడ్డకు. నేను సంపాదించుకోగలను, నా బిడ్డను నేను చూసుకోగలను’ అని నోరుమూయించేవారట.‘‘నేను ఒంటరి మహిళను అంటుండేవారు. కానీ నేను ఒంటరిని కాను. చిన్నప్పుడే తల్లి చనిపోయింది. రిచర్డ్స్‌తో డేటింగ్ తర్వాత నాకు బిడ్డ పుట్టింది. అక్కున చేర్చుకునేవారు ఎవ్వరూ లేరు. అప్పుడు నాన్నే అన్నీ తానై చూసుకున్నారు. నా జీవితంలో మగతోడు అంటూ ఎవరైనా ఉన్నారంటే అది నాన్నే. నా కోసం అన్నీ వదులుకుని వచ్చారు. మనవరాలిని అక్కున చేర్చుకున్నారు. నేను సినిమాలతో బిజీగా ఉంటే నాన్న నా బిడ్డను ఇంటిని చూసుకున్నారు. దేవుడు ఒకటి తీసుకుపోతే మరొకటి ఇస్తారంటారు. భర్తను దూరం చేసి తండ్రిని ఇచ్చాడు’ అంటూ ఎమోషనల్ అయ్యారు.

Related posts