telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘పలాస 1978’ దర్శకుడితో… అల్లుఅరవింద్ సినిమా

దర్శకుడు కరుణ కుమార్ ‘పలాస 1978’ సినిమాను రూపొందించాడు. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమాను , ఈ నెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ కు ప్రివ్యూ షో ను చూపించారు. ప్రివ్యూ షో చూసిన అల్లు అరవింద్ .. దర్శకుడు కరుణ కుమార్ ను అభినందించారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఆయన ఈ సినిమాను ఎంతో సహజంగా చిత్రీకరించాడంటూ ప్రశంసించారు. కరుణ కుమార్ కి మంచి భవిష్యత్తు ఉందంటూ మెచ్చుకున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఆయనతో ఒక సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు అడ్వాన్స్ గా కరుణ కుమార్ కి తన చేతుల మీదుగా చెక్ ను అందించారు. దాంతో కరుణ కుమార్ తన రెండవ సినిమాను గీతా ఆర్ట్స్ 2లో చేయడమనేది ఖరారైపోయింది. అల్లు అరవింద్ తనను అభినందించడమే కాకుండా సినిమా అవకాశం కూడా ఇవ్వడంతో దర్శకుడు కరుణకుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమా గురించి ఇటీవల దర్శకుడు కరుణకుమార్ మాట్లాడుతూ.. 1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కించామని చెప్పారు. సినిమాల్లోకి రావడానికి ముందు కరుణకుమార్ ప్రభుత్వ ప్రకటనలను డైరెక్ట్ చేశారు. స్వచ్ఛ భారత్‌కి మద్దతుగా తాను చేసిన ‘చెంబుకు మూడింది’ లఘు చిత్రం జాతీయ స్థాయిలో రెండో బహుమతి గెలుచుకుంది. ఆ సందర్భంగా కేటీఆర్, వెంకయ్యనాయుడు కరుణకుమార్‌ను సన్మానించారు.

Related posts