telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో కొత్త గెటప్‌లో సత్యదేవ్‌…

సత్యదేవ్ పెద్ద స్టార్ హీరో కాకపోయిన తన వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన నటనతో బ్లఫ్ మాస్టర్‌లా అందరిని మోసం చేశాడు. ఈ సినిమాతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అయితే మొదటగా 2011తో ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు. అదే విధంగా మరెన్నో సినిమాలలో సైడ్ పాత్రల్లో కనిపిస్తూ వచ్చాడు. తరువాత బ్లఫ్ మాస్టర్, అంతరిక్షం వంటి కొత్త తరహా సినిమాలలో నటించిన ప్రధాన్యం పొందాడు. కేవలం సినిమాలే కాకుండా కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ కనిపించాడు. అయితే లాక్ డౌన్ సమయంలో కూడా రెండు సినిమాలను ఓటీటీ వేదికగా విడుదల చేశాడు. వాటిలో ఒకటి మంచి స్పందన పొందింది. దాంతో ప్రేక్షకులు అతడికి ఓటీటీ స్టార్ అంటూ బిరుదును ఇచ్చాుడ. అంతేకాకుండా తన తాజా చిత్రం గువ్వ గోరింకను కూడా ఓటీటీలో విడుదల చేసేందుకు చూస్తున్నాడు. అయితే సత్యదేవ్ నటించి తిమ్మరుసు అభిమానుల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో సత్యదేవ్ లాయర్‌గా కనిపించనున్నాడు. మోసగాడిగా అందరిని మెప్పించిన సత్యా ఇప్పుడు లాయర్‌ పాత్రలో ఎలా చేస్తాడని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. అందులో న్యాయం కోసం పోరాడే న్యాయవాదిగా సత్యదేవ్ కనిపించాడు. టీజర్‌లో లాయర్ అంటే కేసు గెలిచామా? ఓడిపోయామా? అనేది కాదు. ఎంత సంపాదించామనేదే ముఖ్యమని ఓ పాత్ర అంటే దానికి హీరో ఎంత సంపాదించామని కాదు, న్యాయం గెలిచిందా? లేదా? అనేదే నాకు ముఖ్యం అంటూ కనిపిస్తాడు. మరి ఈ సినిమాలో న్యాయం కోసం సత్యదేవ్ ఎంత దూరమెల్లాడనే నేపథ్యంలో తెరకెక్కుంతుంది. ఈ టీజర్‌తో ప్రేక్షకుల్లో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎంత వరకు వారి అలరిస్తోందో చూడాలి.

Related posts