telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జీహెచ్‌ఎంసీ ఫలితాల పై యోగి స్పందన…

yogi adityanath

గ్రేటర్ ఎన్నికలు మంచి రసవత్తరంగా సాగియి. ప్రజలలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అనుకున్నదానికంటే ఎక్కవగానే నెలకొంది. చిట్టచివరికి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 55 సిట్లతో ముందంజలో ఉండగా బీజేపీ 48 సిట్లతో రెండో స్థానంలో నిలుచుంది. ఇక మరో ప్రాంతీయ పార్టీ ఎంఐఎం 44 సీట్లతో మూడవస్థానాన్ని ఆక్రమించుకుంది. ఈ ఫలితాలను ఉద్దేశించి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆసక్తికర ట్వీట్ చేశారు. అయిత మనం చూసినట్లయినతే దాదాపు ప్రతి బీజేపీ నేత భాగ్యనగర్ ఎన్నికల ఫలితాలు అనడం మనం విన్నదే. ఈ ఎన్నికల ఫలితాలలో బీజేపీ ప్రాంతీయ పార్టీ ఎంఐఎంను వెనక్కు నెట్టి రెండవ స్థానంలో ఉండటంపై యోగి హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా భాగ్యనగర నిర్మాణానికి ఈ ఫలితాలతో పుణాది పడిందని పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్‌ను భాగ్రనగరంగా సంబోదించారు. దానితో పాటుగా ప్రధాని మోదీ నాయకత్వంపై వారు చూపిన నమ్మకాన్ని కూడా యోగి కొనియాడారు. అంతేకాకుండా మాపై నమ్మకంతో బీజేపీకి ఓటువేసినందుకు భాగ్యనగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇటీవల యోగి హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆయనను కొందరు హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తారా అని ప్రశ్నించగా దానికి యోగి అవుననే సమాధానం ఇచ్చారు. కచ్చితంగా మారుస్తాము, ఎందుకు మార్చకూడదు ఇంతకు ముందు ఫైజాబాద్‌ను అయోధ్య అని అలహాబాద్‌ను ప్రయాగ్రాజ్ అని బీజేపీ వచ్చాకే మారాయని ఆయన తెలిపారు. అయితే హైదరాబాద్‌ను భాగ్యనగరంగా ఎందుకు మార్చలేమని అడిగారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీపై ప్రజలకు ఉన్న నమ్మకం కనబడిందని, ఇప్పుడు కాకపోయిన మరోసారి కచ్చితంగా బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

Related posts