ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేకులు వేసింది.. తాజాగా పరిషత్ ఎన్నికలపై స్టే విధించింది హైకోర్టు.. కోడ్ అమల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను పాటించలేదన్న సూచనలపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఈసీ నోటిఫికేషన్ ప్రకారం… ఈ నెల 8వ తేదీన ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ పరిషత్ ఎన్నికల నిర్వహణను సవాల్ చేస్తూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ.. హైకోర్టును ఆశ్రయించగా.. బీజేపీ పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు.. టీడీపీ పిటిషన్ను విచారణకు స్వీకరించింది.. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై స్టే విధించింది. అలాగే ఈ కేసులో ఈ నెల 15వ తేదీన అఫిడవిట్ దాఖలు ఎస్ఈసీని ఆదేశించింది హైకోర్టు. అయితే ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసుకున్న వేళ.. హైకోర్టు స్టే ఇవ్వడంతో.. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారిపోయింది.
previous post
next post
జగన్ సీఎం కాబోతున్నారు.. ప్రజల నాడి చూసి చెబుతున్నా: రోజా