telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కరోనా ఎఫెక్ట్ కారణంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…

ఏపీ ప్రభుత్వం కొన్ని కాంట్రాక్టుల్లో వెసులుబాట్లు కల్పించింది. కాంట్రాకుల్లో ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్ల విధానంలో కొద్దిపాటి మార్పులు చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు సంస్థలు, ఏజెన్సీలకు ఆర్ధిక వెసులు బాటు కల్పించేందుకు ఈఎండీ, సెక్యూరిటీ డిపాజిట్ల దాఖలుకు గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోనూ నిబంధనల సడలింపులు ఇచ్చారు. కాంట్రాక్టు అంచనా విలువ నుంచి 2.5 శాతం బదులుగా 1 శాతం మాత్రమే ఈఎండీగా వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. కొనసాగుతున్న పనుల్లోనూ గతంలో వసూలు చేసిన 2.5 శాతం మొత్తం నుంచి కాంట్రాక్టు విలువలో 1.5 శాతాన్ని కాంట్రాక్టర్లు, ఏజెన్సీలకు తిరిగి చెల్లించాల్సిందిగా సూచనలు చేసింది. మిగిలిన ఒక్క శాతం ఈఎండీ మొత్తాన్ని పనులు పూర్తి అయ్యాక చెల్లించాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. సెక్యూరిటీ డిపాజిట్ గా వసూలు చేస్తున్న 7.5 శాతం బదులుగా 2 శాతం మొత్తాన్ని మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత కాంట్రాక్టులతో పాటు ఈ ఏడాది డిసెంబరు వరకూ కుదుర్చుకోనున్న ఒప్పందాలకు వెసులుబాట్లు అమలు కానున్నాయి.

Related posts