telugu navyamedia
క్రీడలు వార్తలు

286 కు ఆల్ ఔట్ అయిన భారత్…

భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం రెండో టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే చెన్నై వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో టీమిండియా రాణించింది. బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు సత్తాచాటడంతో.. ఇంగ్లండ్‌ను పూర్తి డిఫెన్స్‌లో పడేసింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టులో అశ్విన్ (106) తో రాణించడంతో భారత్ 286 పరుగులకు కుప్పకూలిపోయింది. ఇందులో భారత కెప్టెన్ కోహ్లీ కూడా అర్ధశతకంతో రాణించాడు. ఇక మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 329 పరుగులకు ఆల్ ఔట్ అయింది. అయితే అశ్విన్‌ మాయాజాలంతో.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 134 పరుగులకే ఆల్ ఔట్ అయింది. దాంతో పరుగుల ఆధిక్యంతో కోహ్లీసేన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అయితే ఇందులో కేవలం 286 పరుగులు చేయగా ఇంగ్లాండ్ లక్ష్యం 481 గా నిర్ధేశించబడింది. ఇక ఈరోజు ఆట ముగియడానికి ఇంకా 22 ఓవర్లు బాకీ ఉన్నాయి. మరి ఈరోజు ఆట ముగిసేలోగా భారత బౌలర్లు ఎన్ని వికెట్లు తీస్తారు అనేది చుడాలి.

Related posts