telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రాష్ట్రంలో కోవిడ్ ను రాజకీయం చేస్తున్నారు..

Kanna laxminarayana BJP

కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంటుందని సీఎంల సమావేశంలో మోదీ హెచ్చరించారు. బెడ్స్ ఏర్పాటు, వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావటం వంటి వాటిపై సీఎం సమీక్షే నిర్వహించలేదు అని బీజేపీ లీడర్ కన్నా లక్ష్మి నారాయణ అన్నారు. సెకండ్ వేవ్ లో మరణాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాక్సిన్ తొందరగా తీసుకురావాలని మోదీ 35వేల కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. రాష్ట్రంలో కోవిడ్ ను రాజకీయం చేస్తున్నారు. వైసీపీ మద్దతు లేని ఆసుపత్రులను ఇబ్బంది పెడుతున్నారు. ఆక్సిజన్ పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అని అన్నారు. రెమీడెసీవిర్ ఇంజక్షన్లను అందుబాటులోకి తీసుకురావటానికి చేయాల్సినంత ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన సమయంలో కూడా చర్చిల నిర్మాణం కోసం టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని ఎంపి రఘురామ విషయంలో తేలిపోయింది. ఎంపీ విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నాం. ప్రవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ ఇవ్వొద్దని సీఎం లేఖ రాయటాన్ని వ్యతిరేకిస్తున్నాం. మౌలికసదుపాయాలు కల్పన, వ్యాక్సిన్ తీసుకురావటంపై సీఎం శ్రద్ద పెట్టాలి అని అన్నారు.

Related posts