telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యంగ్ హీరోతో అనుష్క రొమాన్స్ !

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క.. దాదాపుగా 15 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉంటూ అందరూ స్టార్ హీరోలతో వర్క్ చేసింది అనుష్క.. తమిళ్ , తెలుగు, కన్నడ భాషలలో కలిపి అనుష్క 50 కి పైగా సినిమాలలో నటించింది. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది అనుష్క. అందులో భాగంగా వచ్చిన అరుంధతి, రుద్రమదేవి, బాగుమతి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా అమ్మడి తాజా సినిమాకు సంబంధించిన వార్తలు సినీ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అనుష్క తదుపరి సినిమాలో యంగ్ హీరోతో రొమాన్స్ చేయనున్నారంట. అది కూడా ఎవరో కాదండి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయగా అందరినీ అలరించి ఇప్పుడు జాతి రత్నంగా మన ముందుకు వస్తున్న నవీన్ పోలిశెట్టి. ఈ మేరకు వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారంట. ఈ చిత్రం 40 సంవత్సరాల మహిళకు 25 సంవత్సరాల కుర్రాడికి మధ్య సాగే ప్రేమకథగా టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలపై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి. ఇదిలా ఉంటే నవీన్ ప్రస్తుతం తన తాజా సినిమా జాతి రత్నాలు రిలీజ్ పరంగా బిజీగా ఉన్నారు. జాతి రత్నాలు సినిమాను అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించారు. ఇందులో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts