టీడీపీ సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈయన నెల్లూరు నియోజక వర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. అయితే తాజాగా, తనకు టికెట్ ఇస్తామని అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందనే మనస్తాపంతో ఆయన పార్టీ వీడినట్టు తెలుస్తుంది. దాదాపు 16ఏళ్లపైగానే పార్టీకి సేవలు అందిస్తున్నా, ఇంత చులకనగా చూడటం తాను సహించలేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికలలో కూడా తనకే సీటు అని చెప్పి, చివరి క్షణంలో మాట తప్పారని గుర్తుచేశాడు.
అనంతరం ఎంపీ సీట్ ఇస్తామన్నారు, అదికూడా దక్కనివ్వలేదు. అంతేకాకుండా, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర కూడా తనకు కనీస గౌరవం కూడా ఇవ్వడంలేదని, అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. పెళ్లకూరు ప్రజలకు, తనను నమ్ముకున్న కార్యకర్తలకు ఏమి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు, అందుకు క్షమాపణలు కూడా కోరాడు.