కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సినీనటి, క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ బుధవారం సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్ విసిరారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ తన చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోని ‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’ విసిరారు. సబ్బుతో తన చేతులు కడిగిన అనుష్క శర్మ వీడియో దిగి దాన్ని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. దేశంలో కరోనా వైరస్ ప్రబలకుండా ముందుజాగ్రత్త చర్యగా అందరూ సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలని అనుష్కశర్మ సలహా ఇచ్చారు.అంతకు ముందు బాలీవుడ్ మరో నటి దీపికా పడుకోన్ కూడా తన చేతులు కడిగి ‘సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్’ విసిరారు.
previous post
ఈ ముగ్గురికీ గుర్తింపు లభించడం లేదు… మంచు విష్ణు ఎమోషనల్ పోస్ట్