telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాస్టార్ సినిమాలో సీనియర్ నటి కీలకపాత్ర

Suhasini

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇది చిరంజీవికి 152 వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమా తరవాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. మలయాళంలో మంచి హిట్ అయిన ‘లూసిఫర్’ సినిమాని చిరంజీవి తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ రీమేక్ లో హీరోయిన్ ఎవరన్నది ఇంకా తేలలేదు. ఇకపోతే కీలక పాత్ర పోషించేందుకు సీనియర్ నటి సుహాసినిని ఎంచుకున్నట్లు సమాచారం. ‘సాహో’ ఫేం సుజీత్ దీనికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Related posts