telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీలో దారుణం..అర్దరాత్రి యువతి పై సామూహిక అత్యాచారం..

rape

ఉత్తర ప్రదేశ్ లో జరిగిన హత్రస్ ఘటన దేశ్యాప్తంగా ఉన్న ప్రజల ఆగ్రహానికి జీవం పోసింది.ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. ఈ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.ఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్‌లో 25 ఏళ్ల యువతి పై నలుగురు యువకులు లైంగికంగా దాడి చేశారు. ఆమె ఎదురు తిరగడంతో తలను గోడకేసి కొట్టడంతో గాయంతో కుప్పకూలింది. అనంతరం నలుగురు యువకులు తమ కామ కోరికలను తీర్చుకున్నారు

అనంతరం యువతిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. మెలుకువ వచ్చిన యువతి భవనం కిందకు వచ్చింది. కొంచెం దూరంలో ఉన్న ఓ ప్రైవేట్ సెక్యూరిటీ తో విషయాన్ని చెప్పింది. అతను వెంటనే అంబులెన్స్ కు కాల్ చేసి ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాధితురాలి వివరాల ప్రకారం కేసు నమోదు చేసుకున్నారు.. నిందితులను వేర్వేరు ప్రాంతాల్లో పట్టుకున్నారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

Related posts