telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విద్యాశాఖలో సంస్కరణలపై మండలిలో నారా లోకేష్ ప్రసంగించారు

విద్యాశాఖలో సంస్కరణలపై మండలిలో స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. చర్చలో భాగాంగా సమాధానం ఇచ్చిన మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గిస్తున్నాం అన్నారు.

రాబోయే రోజుల్లో స్కూల్ కిట్లపైనే రూ.300 కోట్లు ఆదా చేస్తున్నాం పార్టీ రంగుల్లేకుండా సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్కూల్ కిట్లు ఇస్తాం అన్నారు. గత ప్రభుత్వం లో పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు, చిక్కీలపైనా జగన్ ఫోటో ముద్రించారు అన్నారు.

పిల్లలకు ఏకరూప దుస్తులు మార్చాం నాణ్యమైనవి ఇస్తున్నాం, పిల్లలకు భారం లేకుండా పుస్తకాల సంఖ్య తగ్గించాం. పుస్తకాలు బ్యాగులపై ప్రభుత్వ లోగో ఉంటుంది ఇతరుల ఫోటోలు ఉండవు అన్నారు.

పారదర్శకంగా టెండర్లు పిలిచి ప్రభుత్వ సొమ్ము ఆదా చేశాం, ఐదేళ్లలో చిక్కీలపై రూ.240 కోట్లు, కోడిగుడ్లపై రూ.144 కోట్లు ఆదా చేసాము అన్నారు.

గత ప్రభుత్వం ట్యాబ్ల కోసం రూ.1,300 కోట్లు వృథా చేసింది. మేం వచ్చాక ఇంటర్ విద్యలో 16.61 శాతం అడ్మిషన్లు పెరిగాయి అన్నారు.

హైస్కూల్ ప్లస్ విధానంతో పిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు అని అన్నారు.

Related posts