telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బ్యాడ్ న్యూస్ : వాహనదారులకు భారత్ అనే నేను సినిమాలోలాగా ఫైన్లు…

ఏపీ ప్రభుత్వం ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది.  వాహన చట్టంలో మార్పులు తీసురావడంతో పాటుగా, నిబంధనలు ఉల్లంఘించిన వారికీ భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధం అయ్యింది.  దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.  వాహనాలను తనిఖీ చేసే సమయంలో అవసరమైన సమాచారం ఇచ్చేందుకు నిరాకరిస్తే రూ.750 జరిమానా విధిస్తారు.  అనుమతిలేని వ్యక్తులు వాహనం నడిపితే రూ. 5 వేలు, డ్రైవింగ్ లైసెన్స్ అర్హతలేని వ్యక్తులు డ్రైవింగ్ చేస్తే రూ.10వేలు ఫైన్ కట్టాల్సి ఉంటుంది.  నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను రీ మోడలింగ్ చేస్తే రూ.5వేలు ఫైన్ కట్టాల్సి వస్తుంది.  డ్రైవింగ్ చేస్తే మొబైల్ మాట్లాడితే వెయ్యి ఫైన్ కట్టాల్సిందే.  అలానే రేసింగ్ చేస్తూ మొదటిసారి పట్టుబడిన వాళ్ళు రూ. 5వేలు, అదే రెండోసారి పట్టుబడితే రూ.10వేలు ఫైన్ కట్టాలి.  రిజిస్ట్రేషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుంటే మొదటిసారి రెండు వేలు, రెండోసారి ఐదువేలు ఫైన్ రూపంలో కట్టాల్సి ఉంటుంది. 

ఇక పర్మిట్ లేకుండా వాహనం నడిపితే రూ.10వేలు, ఓవర్ లోడ్ తో వాహనం నడిపితే రూ. 20 వేలు ఫైన్ కట్టాల్సి.  బరువు చెక్ చేసేందుకు వాహనం ఆపకుంటే రూ. అత్యధికంగా రూ.40వేల రూపాయలు ఫైన్ వేస్తారట.  అత్యవసర వాహనాలు వెళ్లే సమయంలో తప్పనిసరిగా దారి ఇవ్వాల్సి ఉంటుంది.  అలా దారి ఇవ్వకుంటే రూ.10వేలు ఫైన్ రూపంలో కట్టాల్సి ఉంటుంది.  అంతేకాదు, అనవసరంగా పదేపదే హారన్ కొట్టిన వాహనాలకు మొదటిసారి వెయ్యి రూపాయలు, రెండోసారి రెండువేలు ఫైన్ వేస్తారట.  వాహనదారులు నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడుపుకోవాలి.  లేదంటే ఫైన్ రూపంలో జేబులు చిల్లులు పడటం ఖాయంగా కనిపిస్తోంది.  సవరించిన నిబంధనలు వెంటనే అమలులోకి రాబోతున్నాయి.  కాబట్టి వాహనదారులు జాగ్రత్తలు తీసుకుంటూ డ్రైవింగ్ చేయాలి.

Related posts