దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. రోజు రోజుకు కేసులు సంఖ్య తీవ్రంగా పెరుగుతూనే వున్నాయి. ఇవాళ 71 లక్షల మార్క్‌ను కూడా క్రాస్ చేశాయి కరోనా పాజిటివ్ కేసులు.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో అత్యధికంగా 66,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 816 మంది మృతిచెందారు. ఇదే సమయంలో 71,559 మంది కరోనానుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 71,20,539కు చేరగా.. ప్రస్తుతం 8,61,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
61,49,536 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,09,150 మంది మృతిచెందారు. ఇక, కరోనా రికవరీ రేటు భారత్‌లో 86.36 శాతానికి పెరగగా.. యాక్టివ్ కేసులు 12.10 శాతంగా ఉన్నాయి.. కరోనా మరణాల రేటు 1.53 శాతానికి తగ్గిపోయింది. మరోవైపు.. దేశవ్యాప్తంగా ఆదివారం 9,94,851 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్‌ల సంఖ్య 8,78,72,093కు చేరింది.