telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మహిళలకు శుభవార్త చెప్పిన జగన్ ప్రభుత్వం

cm jagan ycp

జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మహిళలకు లాభం చేకూర్చే మరో పథకానికి శ్రీకారం చుట్టింది ఏపీ సర్కారు. వైఎస్‌ఆర్‌ చేయూత, కాపు నేస్తం, నేతన్న నేస్తం మాదిరిగా మరో కీలక పథకానికి రంగం సిద్ధం చేసింది జగన్‌ ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాపులకు అందిస్తున్న పథకాన్ని ఈబీసీ మహిళలకు వర్తింపజేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇవాళ సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ పథకంపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఈబీసీ నేస్తం పథకానికి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం రూ. 670 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ పథకం కింద ఏటా రూ. 15 వేల చొప్పున మూడేళ్లలో రూ. 45 వేలు సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు మంత్రి పేర్ని నాని.

Related posts