కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో చిత్రీకరణ జరుపుకున్న చాలా సినిమాల విడుదల ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్‌లో ఆన్‌లైన్ రిలీజ్‌లో ముందుడుగు పడింది. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన “గులాబో సితాబో” చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 12న విడుదల కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. అంతేకాదు నవాజుద్దీన్ సిద్ధిఖ్వీ నటించిన గూమ్‌కేతు మే 22న జీ5లో విడుదల కాబోతుంది. ఇక అక్షయ్ కుమార్ నటించిన “లక్ష్మీ బాంబ్” కూడా ఆన్‌లైన్‌లోనే విడుదల కాబోతుంది. వీటికి తోడు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా నటించిన “శ్రేషా”, విద్యాబాలన్ ప్రధానపాత్రలో నటించిన “శకుంతలా దేవి” చిత్రాలు ఆన్‌లైన్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా కరోనా నేపథ్యంలో థియేటర్లు ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు లేనట్లు సమాచారం. దీంతో ఆయా చిత్రాల నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసేందుకు వారు ఆసక్తిని చూపుతున్నారు. కానీ ఆన్‌లైన్ రిలీజ్‌పై సౌతిండస్ట్రీలో పెద్ద రచ్చ జరుగుతోంది. ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తే మా పరిస్థితి ఏంటని థియేటర్ యజమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ఇక్కడి వారు కాస్త ఆలోచిస్తున్నారు.
previous post
‘ఉప్పెన’ చిత్రంపై సేతుపతి కామెంట్స్ …