కస్టమ్స్ అధికారులకు ఒక్కోసారి కొంతమంది నేరగాళ్లు డ్రగ్స్ ను వివిధ సరికొత్త పద్ధతుల్లో సప్లై చేస్తూ షాకిస్తుంటారు. ఇటీవల క్రమంగా బల్లులను తరలిస్తున్న మహిళను అరెస్ట్ చేసి, మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్ అధికారులు బుధవారం కోర్టులో ప్రవేశపెట్టారు. వివరాల్లోకి వెళ్తే… జపాన్ దేశానికి చెందిన మహిళ అక్కడి నుంచి ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఆమె బ్యాగును తనిఖీ చేసిన అధికారులు బ్యాగులో షింగిల్‌బ్లాక్ జాతికి చెందిన 19 బల్లులు గుర్తించారు. ఇటీవలే జపాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు వివిధ కేసులలో అరెస్ట్ అవ్వడంతో.. ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ అప్రమత్తంగా ఉంది. మహిళ చేసింది నేరంగా కోర్టులో రుజువైతే పదేళ్ల శిక్షపడే అవకాశముంది. కాగా కేసు ముగిశాక బల్లులను తిరిగి జపాన్ పంపించే యోచనలో అధికారులు ఉన్నారు. లేదా ఆస్ట్రేలియాలోని వివిధ పాఠశాలలకు, స్వచ్చంధ సంస్థలకు ఆ బల్లులను అప్పగిస్తామన్నారు.
previous post
next post