telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

న్యాయమూర్తులు వెళ్లే మార్గంలో రైతులు మానవహారం

nippula wagu farmers protest for

సీఆర్డీయే రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుల పై  మంగళవారం హైకోర్టులో విచారణ చేపడుతున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతులు న్యాయమూర్తులకు చేతులు జోడించి నమస్కరిస్తూ.. వారు వెళ్లే మార్గంలో మానవహారంగా నిలుచున్నారు. వెంటకపాలెం, మందాడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయపాలెం గ్రామస్తులు రోడ్డుపై కిలోమీటర్ల మేర నిలబడి ప్లకార్డులు ప్రదర్శించారు.

అమరావతి భవితవ్యం న్యాయస్థానం వద్దకు వచ్చిన నేపథ్యంలో ఇక అమరావతిని న్యాయస్థానాలే కాపాడగలవని రైతులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను, రైతులను కాపాడాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని మహిళా రైతులు అన్నారు. త్యాగాలు చేసిన రైతులను ప్రభుత్వం రోడ్డుపై నిలుచోబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలే దేవస్థానాలుగా భావించి న్యాయమూర్తులను వేడుకుంటున్నామని రైతులు పేర్కొన్నారు.

Related posts