గత కొన్ని నెలల నుంచి తెలుగు ప్రేక్షకులను అరిస్తున్న బుల్లి తెర షో ‘ఢీ: కింగ్స్ వర్సెస్ క్వీన్స్ చివరి దశకి వచ్చేసింది. బుల్లితెరపై దూసుకుపోతోన్న షోలలో బిగ్గెస్ట్ డ్యాన్స్ రియాలిటీ షోగా పేరొందిన ‘ఢీ’ ఒకటి.దాదాపు పదమూడేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ షోకు.. రోజురోజుకూ ఆదరణ పెరుగుతూనే ఉంది.

ఈటీవీలో ప్రసారం అవుతోన్న ఢీ షో వల్ల ఎంతో మంది టాలెంట్ బయటకు వచ్చింది. సుదీర్ఘమైన ప్రయాణంలో ఈ కార్యక్రమం వల్ల ఎంతో మంది కొరియోగ్రాఫర్లుగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మరీ ముఖ్యంగా ‘ఢీ’ ద్వారా శేఖర్, గణేశ్, జానీ, రఘు, యశ్వంత్ మాస్టర్లు కొరియోగ్రాఫర్లుగా మారారు. వీళ్లంతా దక్షిణాదిలోని ఇండస్ట్రీల్లో హవా చూపిస్తూ దూసుకెళ్తున్నారు.ఇప్పటికే పన్నెండు సీజన్లు పూర్తి చేసుకుంది ‘ఢీ’ షో.. పదమూడో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది.

ఈ షోకు ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తోన్న ఈ షోలో కింగ్స్ టీమ్‌కు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది.. క్వీన్స్ జట్టుకు రష్మీ గౌతమ్, దీపిక పిల్లి మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు.జడ్జ్‌లుగా గణేష్ మాస్టర్, పూర్ణ, ప్రియమణిలు ఉన్నారు. ఈ షో ఫైనల్స్ కి పలువురు సెలబ్రిటీలు విచ్చేస్తుంటారు. ఈ క్రమంలోనే కాన్ స్టార్ అల్లు అర్జున్.. గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ డ్యాన్స్ షోకు సంబంధించిన కొత్త ప్రోమో రిలీజైంది. ఈ పూర్తి ఎపిసోడ్.. డిసెంబరు 1న రాత్రి 9:30 గంటలకు ప్రసారం కానుంది. అదిరిపోయే డ్యాన్స్‌లతో పలువురు కంటెస్టెంట్లు ప్రేక్షకులను అబ్బురపరిచారు. వీరికి తోడు సుధీర్-ప్రదీప్-ఆది చేసిన కామెడీ తెగ నవ్విస్తోంది. ఇది వైరల్ అవుతోంది.
ఇప్పుడు బన్నీ కూడా రెండోసారి రాబోతున్నాడు. గతంలో అతడు ఓ సీజన్‌కు గెస్టుగా వచ్చాడు. దాదాపు పదేళ్ల తర్వాత దాన్ని ఇప్పుడు రిపీట్ చేయబోతున్నాడు.
‘పుష్ప’ ప్రమోషన్లో భాగంగా అల్లు అర్జున్.. పలు కార్యక్రమాల్లో సందడి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే ‘ఢీ’లోనూ సందడి చేశారు. తన కొత్త సినిమా ‘పుష్ప’లోని ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్‌కు తనదైన మేనరిజంతో కనువిందు చేశారు. బన్నీ బన్నీ అని అక్కడ అందరూ గట్టిగా అరిచారు.త్రీ అప్పుడు వచ్చా.. థర్టీన్ అప్పడు మళ్ళ వస్తాన్నా బన్నీ అనడంతో..ప్రదీప్ పదేళ్ళు అయినా పదును తగ్గలేదు అని ప్రదీప్ డైలాగ్ విసిరాడు.

డిసెంబరు 17న పాన్ ఇండియా స్థాయిలో ‘పుష్ప’ రిలీజ్ కానుంది.ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్న నటించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో దీనిని తెరకెక్కించారు. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.


నేనెప్పుడూ పవన్ కళ్యాణ్ అభిమానినే : హరీష్ శంకర్