telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

సహజీవనంపై మరోసారి తీర్పు వెల్లడించిన హైకోర్టు…

అబ్బాయిలు, అమ్మాయిలు.. తమకు నచ్చినవాడితో పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్నారు.. అయితే, దీనిపై చాలా అభ్యంతరాలున్నాయి.. పెళ్లి చేసుకోకుండా కలిసి జీవించడం ఏంటి? అని పెద్దలు, సాంప్రదాయ వాదులు మండిపడుతున్నారు. ఇక, సహజీవనంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది… మేజర్ అయిన ఓ అమ్మాయి, అబ్బాయి కలిసి జీవించడం వారి హక్కుగా పేర్కొంది హైకోర్టు.. అంతేకాదు, వారి స్వేచ్ఛను హరించే హక్కు వారి తల్లిదండ్రులతో సహా ఎవరికీ లేదని స్పష్టం చేసింది.. సహజీవనం చేస్తున్న జంట వేసిన రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు… పై విధంగా స్పందించింది.  పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫరూఖాబాద్‌కు చెందిన కామినీ దేవి, అజయ్ కుమార్ జంట అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.. తాము ఇద్దరం మేజర్లమని, ప్రేమించుకుంటున్నామని కలిసి జీవిస్తున్నామని రిట్ పిటిషన్‌లో పేర్కొన్నారు.. అంతేకాదు.. తనను తల్లిదండ్రులు వేధింపులకు గురి చేస్తున్నారని, వేరే అబ్బాయితో పెళ్లికి బలవంతం చేస్తున్నారంటూ కామినీ దేవి తన పిటిషన్‌లో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది… ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ అంజనీ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రకాశ్ పడియా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం… రాజ్యాంగం ప్రసాధించిన జీవించే హక్కును కాలరాసే హక్కు ఎవరికీ లేదని పేర్కొంది. ఇదే సమయంలో.. వారికి రక్షణ కల్పించాల్సిందిగా ఫరూఖాబాద్ ఎస్ఎస్పీని ఆదేశించింది.

Related posts