telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబు ఓ గుంట నక్క..ఆనందయ్య క్రెడిట్ ను కొట్టేయాలని చూస్తున్నాడు : విజయసాయిరెడ్డి

చంద్రబాబుపై ఎంపి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య క్రెడిట్ ను ఎలా కొట్టేయాలా అని గుంట నక్కలా చంద్రబాబు స్కెచ్ వేస్తున్నాడని ఫైర్ అయ్యారు. “నలుగురు ఎవరి గురించైనా అభిమానంగా చర్చించుకుంటున్నా, మీడియాలో హడావుడి కనిపించినా బాబు వక్ర దృష్టి అటు పడుతుంది. అందులోకి ఎలా దూరాలా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య క్రెడిట్ ను ఎలా కొట్టేయాలా అని స్కెచ్ వేస్తున్నాడు గుంట నక్కలా. నదీనదాలు, కొండలు, ఎడారులా మనకడ్డంకి అన్న శ్రీశ్రీ మాటలను వారు మరోలా అర్థం చేసుకున్నారు. ల్యాండ్ కనిపిస్తే చాలు పచ్చజెండా పాతేశారు పత్తిపాటి పుల్లన్న. జూబ్లీహిల్స్ సొసైటీ బోర్డునే తొలగించి కబ్జా చేసిన వారికి…విశాఖ భూములు ఒక లెక్కా? వైసీపీ వచ్చిన తర్వాత వీరి కబ్జాలకు తెరపడింది. ” అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక అంతకు ముందు ట్వీట్ లో “చంద్రబాబు హయాంలో కార్పోరేట్ హాస్పిటళ్లను పెంచి పోషేంచేందుకే పనికొచ్చిన ఆరోగ్యశ్రీని ఈ రెండేళ్లలో సిఎం జగన్ గారు సంజీవనిగా మార్చారు. 95 శాతం మంది ప్రజలు దీని పరిధిలోకి రావడం, కరోనా, బ్లాక్ ఫంగస్ లను ఆరోగ్యశ్రీలో చేర్చి అందరికీ భరోసా కల్పించారు.” అని తెలిపారు విజయ సాయిరెడ్డి.

Related posts