విశాఖపట్నం విమానాశ్రయం లో నటసింహా, నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. బాలయ్య , బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ సినిమా విజయం సాధించిన సందర్భంగా విశాఖ లో విజయోత్సవ వేడుకలు లో పాల్గొనేందుకు వచ్చారు.
ఈ క్రమంలో విమానాశ్రయం కు చేరుకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం లో రాడిషన్ హోటల్ కు బయలుదేరి వెళ్లారు.