telugu navyamedia
సినిమా వార్తలు

‘ఊ అంటావా.. ఊహు అంటావా’ సమంత స్పెషల్ సాంగ్ అప్డేట్

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌‌లో తెరకెక్కుతున్న సినిమా ‘పుష్ప’ .శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో తీసిన ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్.. ఈ డిసెంబరు 17న పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి.

Samantha Akkineni's Item Song for Allu Arjun's Film Pushpa Teased with Back  Shot Poster of Actress

ఇటీవ‌ల విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’, ‘సామి’, ‘ఏయ్‌ బిడ్డా’ అనే నాలుగు పాటలు.. ‘పుష్ప’ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి.

తాజాగా ..’పుష్పస నుంచి కొత్త అప్డేట్​ వచ్చింది.  ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అంటూ సాగే ఈ పాటను డిసెంబర్ 10 న రిలీజ్ చేస్టున్నట్లు మేకర్స్ తెలిపారు. “మాస్ పార్టీకి సిద్ధం కండి .. సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్” అంటూ సామ్ న్యూ పోస్టర్ తో అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో సామ్ బ్లూ కలర్ తళుక్కు టాప్ లో హాట్​గా  సెక్సీ లుక్ తో క‌నిపిస్తోంది pushpa movie samantha song

ఈ సినిమాకు రష్మిక హీరోయిన్‌గా ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడుగా, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించగా, సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్​ భారీ బడ్జెట్​తో నిర్మించింది.

Related posts