telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆకట్టుకున్న పూర్ణ ‘సుందరి’ ఎమోషనల్ వీడియో

కేరళ కుట్టి పూర్ణ 2007లో “శ్రీ మహాలక్ష్మి” సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆపై “అవును” చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. తమిళ, మళయాలంలో మంచి పాత్రలను పోషించి అక్కడి ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాలు లేక ఓ డ్యాన్స్ షో జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న కథాచిత్రం ‘బ్యాక్ డోర్’. ప్రముఖ కథానాయకి పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ వినూత్న కథా చిత్రాన్ని.. ‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ త్రిపురణ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే.. తాజాగా కళ్యాణ్‌జీ దర్శకత్వంలో పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం సుందరి. కుటుంబ కథాంశంతో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాగా ఈ సినిమా రూపొందుతోంది. ఇటీవలే విడుదలైన సుందరి ఫ్రి లుక్‌ పోస్టర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పోస్టర్‌లో సంప్రదాయ నృత్యం చేస్తూ పూర్ణ కనిపించింది. తాజాగా సుందరి లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఆ వీడియోలో పూర్ణ ఎంతో అందంగా కనిపిస్తోంది.

Related posts