telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణాలో కొత్తగా 1873 కరోనా కేసులు

corona covid

తెలంగాణలో ప్రతిరోజూ రెండు వేలకు పైగా కరోనా కేసులు ఈరోజు కాస్త తగ్గాయి. తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం, తెలంగాణలో కొత్తగా 1873 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,24,963కి చేరింది. ఇందులో 92,837 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 31,299 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. జీహెచ్ఎంసి పరిధిలో 360, జగిత్యాల 77, కరీంనగర్ లో 180, ఖమ్మం 103, నల్గొండ 79, నిజామాబాద్ 94, రంగారెడ్డిలో 129, సిద్ధిపేట 85, సూర్యాపేటలో 65, వరంగల్ అర్బన్ లో 94 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 827కి చేరింది.

Related posts