telugu navyamedia
సినిమా వార్తలు

రాజశేఖర్ డూప్ కు యాక్సిడెంట్… గాయాలు

Anjaneyulu

సినీ నటుడు రాజశేఖర్ కు డూప్ గా కనిపించే ఆంజనేయులు అనే వ్యక్తికి, ఆయన భార్యకు నిన్న జరిగిన యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వద్ద శనివారం రాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇందిరానగర్‌లో నివసించే ఆంజనేయులు భార్యతో కలిసి శనివారం రాత్రి ద్విచక్రవాహంపై గచ్చిబౌలి బయలుదేరారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వీరి బైక్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆంజనేయులు కాళ్లు, చేతులకు గాయాలు కాగా, ఆయన భార్య కూడా గాయపడింది. ఈ ఘటనపై ఆంజనేయులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా… కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Related posts