telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

శ్వేత కేసులో ప్రియుడు అజయ్ అరెస్ట్…

సాఫ్ట్‌వేర్ శ్వేత కేసులో ప్రియుడు అజయ్ ని అరెస్ట్ చేసారు పోలీసులు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం అందరికి తెలిసిందే. ప్రేమ పేరుతో ప్రియుడు వంచించడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఆ ఇంజనీర్. ప్రేమ పేరుతో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టాడు ప్రియుడు అజయ్. వ్యక్తిగతం గా ఉన్న ఫోటోలు అన్ని సోషల్ మీడియా లో పోస్ట్ చేసాడు. ఆ తర్వాత సోషల్ మీడియా లో పెట్టిన ఫోటోలు తీసేందుకు బ్లాక్ మెయిల్ చేసాడు . అజయ్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది శ్వేత.ట్రైన్ కు ఎదురు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తన కూతురు ని అజయ్ అనే యువకుడు హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరిస్తున్నారంటూ శ్వేత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో శ్వేత ను మోసం చేశాడంటు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్వేత కేసు ఆత్మహత్య ? హత్య ? అనే కోణం లో విచారణ జరిపిన పోలీసులు అజయ్ కారణంగానే శ్వేత ఆత్మహత్య చేసుకుంది అని తేల్చేసారు. దాంతో ఇక ఈ కేసులో నిందితుడు అజయ్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమె ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం వల్లే  ఆత్మహత్య చేసుకుందన్నారు పోలీసులు. సోషల్ మీడియాలో ఫొటోలను డిలీట్ చేయకుండా అజయ్ వేధింపులు గురిచేశాడన్నారు పోలీసులు. అరెస్ట్‌ చేసిన నిందితుడు అజయ్ ని రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

Related posts