ప్రాంతీయ అసమానతల వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం మూడు రాజధానుల ప్రతిపాదనపై ప్రజలంతా మద్దతిస్తున్నారని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తమ్మినేని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారికుంటాయని, అయితే ప్రజాభిప్రాయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు. నాడు వికేంద్రీకరణ జరగకపోవడం వల్లే కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం వచ్చిందని అన్నారు. ఉత్తరాంధ్ర వలసలు ఆగాలంటే వికేంద్రీకరణ వల్లే సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు.
డెంగ్యూ గురించి సరైన సమాధానం ఇవ్వడం లేదు: మల్లుభట్టి