మంత్రి కొడాలి నాని చంద్రబాబు పని ఫైర్ అయ్యారు. తాజాగా కొడాలి మాట్లాడుతూ… ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల రూపంలో 90 వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లో జమ చేసింది. అటువంటి ప్రభుత్వం ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయించటానికి 1600 కోట్లు ఖర్చు పెట్టడానికి వెనుక అడుగు వేస్తారంటే ప్రజలు నమ్ముతారా అని అన్నారు. ప్రభుత్వం సీరం ఇన్సుట్యూట్, భారత బయోటెక్ కంపెనీలకు వ్యాక్సిన్ కోసం లేఖలు రాసింది. రామోజీ రావు కొడుకు వియ్యంకుడి కంపెనీ, చంద్రబాబు పెట్టానని చెప్పే భారత్ బయోటెక్ మే 4 న ఏం సమాధానం ఇచ్చిందో తెలుసా అని ప్రశ్నించారు.కేంద్రం 3 లక్ష 43 వేల డోసులే ఇమ్మని చెప్పింది. 1, 20,000 డోసులు ఇచ్చాం… మిగిలినవి త్వరలో ఇవ్వటానికి ప్రయత్నిస్తాం అని చెప్పింది. సీరం ఇనిస్టిట్యూట్ 9, 91, 000 డోసులు ఇమ్మని కేంద్రం చెప్పింది. మే నెలలో ఇవ్వగలం అనుకుంటున్నాం అని చెప్పింది. ఏప్రిల్ 24న కేంద్రానికి లేఖ రాశాం అని అన్నారు. దమ్ముంటే చంద్రబాబు అకౌంట్ నెంబర్ ఇవ్వాలి అన్నారు. ఆ అకౌంట్ నెంబర్ కు 1600 కోట్లు జమ చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రోజుకు 10 లక్షల వ్యాక్సిన్ డోసులు ఇప్పించగలిగే సత్తా ఉందా. ఇటువంటి దుర్మార్గులను వదిలిపెట్టకూడదు అని అన్నారు.
previous post
next post