‘శ్రీమహాలక్ష్మి’, ‘అవును’, ‘సీమ టపాకాయ్’, ‘అఖండ’ వంటి చిత్రాలతో తెలుగువారిని అలరించిన మలయాళీ నటి పూర్ణ. ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ గా చేస్తూ పలు టీవీ షోలలో పాల్గొంటుంది.

దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడబోతోంది. ఇటీవలే గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది..తాజాగా ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను’ అంటూ కాబోయే భర్తతో దిగిన ఫొటోను షేర్ చేసింది. పూర్ణ పెట్టిన పోస్ట్ చూసిన సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరి పెళ్లి తర్వాత కూడా పూర్ణ సినిమాల్లో కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి.


