telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

నటి, మోడల్ గెహానా అరెస్ట్..

టీవీ నటి, మోడల్ గెహానా ఈరోజు అరెస్ట్ అయ్యారు. అయితే ఆమెను ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ వారు అదుపులోకి తీసుకున్నారు. ఆ వీడియోలను చిత్రీకరణ చేసి, కొన్ని వెబ్‌పైట్‌లలో పెడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గెహానా అరెస్ట్ కావడంతో ప్రస్తుతం ఈ వార్త జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది. గతంలో ఇలాంటి ఆరోపణలు అందుకున్న ఆమె ఇప్పుడు చట్టపరమైన ఇబ్బందులు చవిచూస్తున్నారు. ఆమె కొన్ని తెలుగు సినిమాల్లో కనిపించారు. గెహానా మోడల్‌గా చాలా బ్రాండ్‌లకు ప్రకటనలు చేశారు. అంతేకాకుండా మిస్ ఆసియా బికినీగా కిరీటం కూడా పొందారు. అయితే ఆ వీడియోల్లో నటించాలని బలవంతం చేశారని ముగ్గురు వ్యక్తులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారి చెప్పిన దాని ప్రకారం. ఆమె ఇప్పటి వరకు దాదాపు 87 వీడియోలను ఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారని, ఈ వీడియోలను చూడాలంటే ఆ వెబ్‌సైట్‌ను సస్క్రైబ్ చేసుకోవాలని, ఆ సస్క్రైబ్ చేసుకోవడానికి దాదాపు రూ.2వేలు కట్టాలని పోలీసు వారు తెలిపారు. అయితే ఆమెను ఇంకా విచారణ జరుపుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts