telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్ వ్యాఖ్యల పై స్పందించిన అలీ..తనకేం సహాయం చేశారు సార్!

Ali comments Pawan Kalyan YCP

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, హాస్య నటుడు అలీ ఘాటుగా స్పందించారు. ఆలీ కష్టాల్లో ఉన్నప్పుడు సాయపడ్డాను అని పవన్ అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కు అలీ కౌంటర్ ఇచ్చారు. మీరు ఏ విధంగా సాయపడ్డారు పవన్ సర్. అంటే ధనం ఏమైనా ఇచ్చారా? నాకు ఏమైనా సినిమాలు చెప్పారా? సినిమాలు లేక ఇంట్లో ఉంటే తీసుకెళ్లి అవకాశాలు ఇప్పించారా?సార్ అని అలీ అన్నారు.

మీరు ఇండస్ట్రీలోకి రాకమునుపు నుంచి నేను ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాను. నేను కష్టాల్లో ఉన్నాను. రూపాయి సాయం చేయమని ఏనాడూ ఎవ్వరి దగ్గరా అడగలేదు అని అలీ అన్నారు. అల్లా దయవల్ల చాలా బాగున్నానని, ఇంకా అడిగే అవకాశం వస్తే అప్పటికి ఆలీ ఉండడని. ఆకలితో చచ్చిపోతాను తప్ప వెళ్లి అమ్మా.. దేహీ అనే స్థితికి వెళ్లనని అన్నారు. మీరు రాజమండ్రిలో విమర్శ చేయటం సరికాదని అలీ అన్నారు. వైసీపీలో చేరితే తప్పేంటి? అదేమైన నేరమా? రాజ్యాంగంలో రాసుందా అక్కడకు వెళ్లకూడదని అన్నారు. నాకు స్వేచ్ఛ లేదా? మీ గురించి నేను వ్యాఖ్యానిస్తే మీరు నాగురించి కామెంట్ చేయాలి. రాజమండ్రిలో పవన్ నా పై కామెంట్ చేయటం సరికాదని అలీ పేర్కొన్నారు.

Related posts