telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఎంపికైన అభ్యర్థులు కాల్ లెటర్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు: గిరిజా శంకర్

AP-Grama-Sachivalayam

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం నిర్ణీత ప్రదేశంలో హాజరుకావాలని సమాచారం పంపామని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ పేర్కొన్నారు. మెస్సేజ్ లు, ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం అందించామని తెలిపారు. గ్రామ సచివాలయ వెబ్ సైట్ నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ ఆధారంగా కాల్ లెటర్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

ఇప్పటికే కాల్ లెటర్స్ అందుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారం, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, విద్యార్హతలు, క్యాస్ట్ సర్టిఫికెట్ ను సంబంధిత వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. సదరు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఆయా సర్టిఫికెట్లను డౌన్ లోడ్ చేసుకుని, వెరిఫికేషన్ సమయంలో అధికారులకు సమర్పించాలని సూచించారు.

Related posts